KMM: మధిర ఆర్టీసీ డిపోలో శుక్రవారం జరిగిన ఎన్నికలను వైరా ఏసీపీ సారంగపాణి పరిశీలించారు. ఫలితాల సమయంలో ఉద్యోగులు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మధిర టౌన్ ఇన్‌స్పెక్టర్ డి. రమేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్నికల భద్రతను పరిశీలించిన ఏసీపీ..


