హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్బులతో జూదం.. 9 మంది అరెస్ట్

SRPT: మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో డబ్బులతో జూదం ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠంపల్లి ఎస్‌ఐ బి. ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి రూ.15,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.