హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలు పట్టివేత

NZB: కోటగిరి నుంచి నిజామాబాద్ వైపు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు బొలెరో వాహనాలను శుక్రవారం మోస్రా మండలం గోవూర్ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ని SI వంశీ కృష్ణా రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.