సత్యసాయి: నీటి ఎద్దడితో ఎండిపోతున్న ఉద్యాన తోటలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం జీవనాధార సాగునీటి పథకం అమలు చేస్తోంది. అర్హులైన రైతులకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించడంతో పాటు 80% వరకు రాయితీ కల్పిస్తుంది. బత్తాయి, మామిడి, వక్క తోటలకు ఎకరానికి నెలకు రూ.5,616 - రూ.12,480 వరకు రాయితీ లభిస్తుంది. ఐదు ఎకరాలలోపు తోటలున్న రైతులు ఆర్‌ఎస్‌కేలలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
'ఎండుతున్న తోటలకు 80% రాయితీ'


