హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్స్ దొంగ అరెస్టు

విజయనగరం రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగతనాలు చేస్తున్న ఛత్తీఘర్ రాష్ట్రం రాయపూర్‌కు చెందిన శత్రుఘ్న తండిని అదుపులోకి తీసుకొన్నట్లు జీఆర్పీ పోలీసులు శుక్రవారం తెలిపారు. దొంగతనం చేసిన సుమారు రూ 20 వేలు విలువైన మొబైల్‌ను స్వాధీనం చేసుకొని, రిమాండ్ నిమిత్తం విశాఖ కోర్టుకు తరలించినట్లు చెప్పారు.