హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ షాపులలో అధికారులు తనిఖీలు

AKP : నర్సీపట్నంలో పలు మందుల దుకాణాల్లో పోలీస్, ఔషధ నియంత్రణ శాఖ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. రజిత ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మత్తు కలిగించే టాబ్లెట్లు, ఇంజెక్షన్ల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.