హైదరాబాద్: 28°C
క్రీడలు

భార‌త్‌ ఓట‌మి.. సిరీస్ ఆస్ట్రేలియా సొంతం

భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆస్ట్రేలియా-ఎ జ‌ట్టు మూడు మ్యాచ్‌ల అన‌ధికారిక వ‌న్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. పాండిచ్చేరి వేదిక‌గా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 69 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్-ఎ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది.