రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు సంబంధించి సౌరాష్ట్ర తమ జట్టును ప్రకటించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్‌ను సారథిగా ఎంపిక చేసింది. అలాగే, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. ఈసారి మెరుగ్గా రాణించాలని పట్టుదలతో ఉన్న సౌరాష్ట్రకు జడ్డూ రాక సానుకూల అంశంగా మారింది. కాగా, అక్టోబరు 11న ఛత్తీస్‌గఢ్ జట్టుతో సౌరాష్ట్ర తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
క్రీడలు
జట్టు ప్రకటన.. రవీంద్ర జడేజాకు చోటు


