హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: సంజూ శాంసన్ హాఫ్‌ సెంచరీ

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అకీల్ వేసిన ఐదో ఓవర్‌లో సంజూ.. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. కాగా, సంజూ హాఫ్ సెంచరీలు చేసిన 11 టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలుపు ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.