హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతానికి మించి సీట్లు: ఎమ్మెల్యే

BPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఎన్నికలు జరగడం, గ్రామాలకు నిధులు రావడం వైసీపీకి ఇష్టం లేకే కోర్టు కేసుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.