BPT: పర్చూరు మండలం ఇసుకదర్శి గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, రూ.1.08 కోట్లతో చేపడుతున్న 13 సీసీ రోడ్ల పనులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల పనులను వేగంగా పూర్తి చేస్తాం: మంత్రి


