హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు

ATP: గుంతకల్ పట్టణంలోని రాజేంద్రనగర్‌లో గల ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. రేపటి నుంచి దసరా సెలవులు కావడంతో ఈ ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.