హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం'

అన్నమయ్య: టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.