హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

VSP: సింహాచలంలో ఈ నెల 11 నుంచి 19 వరకు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 20న విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు.