హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత నివ్వాలి'

NLG: నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పీడీ సుదర్శని సూచించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి కి శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలనకు విచ్చేశారు. వరి, పత్తి కాకుండా ఇతర ప్రత్యేక పంటలు ఎంపిక చేసుకోవాలన్నారు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ, నాణ్యమైన దిగుబడిని పొందాలని సూచించారు.