హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు కోట శరణ్య

PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కోట శరణ్య రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు బౌలర్‌గా ఎంపికైంది. కొమరాడ మండలం విక్రమపురంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో శరణ్య మీడియం ఫాస్ట్ బౌలర్‌గా ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా శరణ్యతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు జయకుమార్ పాల్గొన్నారు.