హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు వృత్తి విద్యపై అవగాహన

AKP: నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ హైస్కూల్‌కు చెందిన 9, 10 తరగతుల విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా శుక్రవారం అడ్డరోడ్డు మారుతి సుజుకి షోరూంలో క్షేత్రస్థాయి శిక్షణ నిర్వహించారు. కార్ల ఛాసిస్, ఇంజిన్, కూలెంట్ ట్యాంక్, వీల్ అలైన్మెంట్, అమ్మకాలు, కస్టమర్ సేవలపై అవగాహన కల్పించారు. హెచ్ఎం యు. వరలక్ష్మి పాల్గొన్నారు.