హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీఎంసీ మొబైల్ కోర్టులో 14 మందికి జరిమానా

NTR: విజయవాడలో నిబంధనలు ఉల్లంఘించిన 14 మందిపై వీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం పటమట సర్కిల్-3 కార్యాలయంలో మొబైల్ కోర్టు నిర్వహించి, రోడ్లపై చెత్త వేయడం, వ్యర్థాలు పారేయడం, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. జడ్జి నరేంద్ర రెడ్డి విచారణ జరిపి మొత్తం రూ.3,810 జరిమానా విధించారు.