ASR: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ప్రైవేట్ అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 10 నుంచి 21వరకూ దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో జీ.భానుమూర్తి రాజు శుక్రవారం తెలిపారు. సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఈనెల 22న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 10 నుంచి సెలవులు


