హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యనిర్వహక దళ్ సభ్యుడిగా వాసు

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ నిర్వాహక దళ్ సభ్యుడిగా గురివిగారి వాసు ఎన్నికయ్యారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షించే పార్లమెంట్ నియోజకవర్గాలకు కార్యనిర్వాహక దళాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 12 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన దానికి గుర్తింపు వచ్చింది అన్నారు. పార్టీ కోసం కష్టించి పని చేస్తానన్నారు.