హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీధి కుక్కల బెడదతో ఇబ్బందులు

KDP: పులివెందుల పట్టణంలోని అంబకపల్లి రోడ్డు, HDFC బ్యాంకు వెనుక వీధిలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ చిన్నారులపై దాడులకు యత్నిస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.