హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కుట్రలకు సుప్రీంకోర్టుతో అడ్డుకట్ట: ఎమ్మెల్యే

ATP: స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ పన్నిన కుట్రలకు సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఓటర్ల సవరణ తర్వాతే వార్డుల పునర్విభజన జరగాలన్న వైసీపీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం ప్రజాస్వామ్య విజయమన్నారు. బీసీలకు 34% కంటే ఎక్కువ రాజకీయ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.