హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాంటీ డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

NLR: కోవూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం శక్తి టీం నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్, రోడ్ యాక్సిడెంట్స్ మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శక్తి యాప్‌ను విద్యార్థులు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా బాగా చదువుకోవాలని సూచించారు.