హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైపులైన్ లీకేజీ.. వృథాగా పోతున్న తాగునీరు!

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1ఆలీనగర్‌లో మసీదు వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీ సమస్యతో తాగునీరు వృథాగా పోతోంది. కొద్ది రోజులుగా పైపులైన్ నుంచి నీరు లీకవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీని వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.