హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగొండలో తాగునీటి సమస్యపై CPM వినతి

WG: పెనుగొండ పంపన వారి వీధిలో నివసిస్తున్న 50 కుటుంబాలకు వాటర్ పైపు ద్వారా కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. ఈ సమస్యపై CPM ఆధ్వర్యంలో కాలనీ వాసులు పంచాయతీ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. తాగునీరు రంగు మారి, తీవ్ర దుర్వాసన వస్తుందని, దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులకు తెలిపారు.