హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

కోనసీమ: జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DPTO సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీం ద్వారా ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ విభాగాలలో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.