హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

VZM: చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ, మాజీ వార్డు సభ్యులు, వైసీపీకు చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరుతున్నారని చెప్పారు.