ASR: అరకు మండలం మాదల పంచాయతీ బొందుగుడ గ్రామంలో బోరుకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు కుమిడి రమేష్, అప్పలరాజు, రవీంద్ర డిమాండ్ చేశారు. ఈమేరకు, శుక్రవారం పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి అందించారు. విద్యుత్ సౌకర్యం లేక రెండు నెలలుగా తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి'


