హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోటకట్లలో స్కౌట్, గైడ్ యూనిట్ల ప్రారంభం

అన్నమయ్య: సంబేపల్లి మండలం మోటకట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన స్కౌట్, గైడ్ యూనిట్లను అన్నమయ్య జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ప్రారంభించారు. స్కౌటింగ్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 17 మంది స్కౌట్ విద్యార్థులకు, 15 మంది గైడ్ విద్యార్థినులకు యూనిఫామ్‌లు పంపిణీ చేశారు.