హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాయల్పాడులో చేగువేరా వర్ధంతి కార్యక్రమం

అన్నమయ్య: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వాయల్పాడు పట్టణంలోని ఉర్దూ మైనారిటీ గురుకుల పాఠశాలలో విప్లవ యోధుడు చేగువేరా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు పెంపొందించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.