హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీపీఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

BHPL: మల్హర్ రావు మండల పరిధిలోని మల్లారం ఎంపీపీఎస్ పాఠశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులందరూ కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు.