ELR: గొల్లగూడెం సెక్షన్ పరిధిలోని ఏ.గోకవరం విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా వేళల్లో మార్పులు ఉన్నాయని ఏఈ వేణు తెలిపారు. వ్యవసాయ ఫీడర్లకు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఉంటుందన్నారు. కొత్తగూడెం డొమెస్టిక్ ఫీడర్ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


