KDP: పులివెందుల మండలం మల్లికార్జునపురంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కాలువలు సక్రమంగా లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్లపై మురుగు.. ప్రజలకు ఇబ్బందులు


