హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణన-2027 సదస్సుకు కలెక్టర్ నిశాంతి

ASR: జనగణన-2027 నిర్వహణపై శుక్రవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సుకు కలెక్టర్ టీ.నిశాంతి హాజరయ్యారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ.సాయిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జనగణన నిర్వహణ, అధికారుల బాధ్యతలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు.