హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధాన్యం బకాయిలతో వ్యాపారి పరారీ

BPT: రేపల్లె మండలం బేతపూడిలో ధాన్యం బకాయిల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి తూనుకుంట్ల మాధవరావు సుమారు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు వచ్చాయి. తమకు రావాల్సిన నగదు అందకపోవడంతో బాధిత రైతులు రేపల్లె పట్టణ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.