హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 153 ఫిర్యాదులు

ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 153 ఫిర్యాదులు అందాయి. సబ్ కలెక్టర్ సాహిత్, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను జేసీ ఆదేశించారు.