హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైప్‌లైన్‌ లీకేజీతో వృథాగా తాగునీరు

KKD: సామర్లకోటలోని గోలివారి వీధిలో తాగునీటి పైప్‌లైన్‌ పగిలిపోవడంతో గత నాలుగు రోజులుగా నీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోతున్నారు. పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాలకు అరకొరగా తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, లీకేజీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.