ASR: పాడేరు జీటీడబ్ల్యూఏ పాఠశాలలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు ప్రారంభమయ్యాయి. డీఈఓ భానుమూర్తి రాజు, జిల్లా క్రీడల అధికారి జగన్‌మోహన్ రావు పోటీలను ప్రారంభించారు. అండర్-14, 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అండర్-14, 17 క్రీడా ఎంపికలు ప్రారంభం


