హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం'

KKD: సామర్లకోట జగనన్న కాలనీలో అమృత్ 2.0 పథకం కింద రూ. 2.96 కోట్లతో నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. కాలనీలో ప్రతి ఇంటికీ పైప్‌లైన్ల ద్వారా మంచినీరు అందిస్తామని, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.