హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 12న ఉద్యోగులు తరలిరావాలి'

VZM: ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌–2025 వల్ల ఉద్యోగులు స్థానికత, జోనల్‌ విధానం, పదోన్నతుల విషయంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని AP ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నెల్లిమర్ల తాలూకా అధ్యక్షుడు వీరన్న దొర అన్నారు. శుక్రవారం నెల్లిమర్లలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12న సోమవారం విశాఖపట్నంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించనున్న చర్చావేదికకు తరలిరావాలని పిలుపునిచ్చారు.