హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి రెడ్డెమ్మ దేవత దసరా ఉత్సవాలు

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డెమ్మ దేవత ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి, తీర్థప్రసాదాల పంపిణీ చేపడతారు. భక్తులు పాల్గొనాలని ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, ఈవో మంజుల కోరారు.