PLD: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2002 నుంచి ఓటీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న తమకు 2026 మార్చి నుంచి జీతాలు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధి పోర్టల్‌లో పోస్టులు కనిపించకపోవడంతో సమస్య ఏర్పడిందని తెలిపారు. ఉన్నతాధికారులను పలుమార్లు కలిసినా పరిష్కారం లభించలేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్చి నుంచి జీతాల కోసం ఎదురుచూపులు


