సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రోడ్డులో కేటాయించిన స్థలంలో కాపు భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు ఎమ్మార్వో దేవరాజును కోరారు. మంత్రి సత్యకుమార్ సూచనల మేరకు శుక్రవారం ఆయనను కలిశారు. 2019లో కేటాయించిన 69 సెంట్ల స్థలంలో భవన నిర్మాణానికి భూమి రికార్డులు పరిశీలించి, పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాపు భవన్ నిర్మాణానికి చర్యలు


