హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి పైప్‌లైన్ పనులు ప్రారంభం

ELR: ఉంగుటూరు (M) రావులపర్రు గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మండల పరిషత్ నిధుల నుంచి రూ.4.60 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో చేపట్టనున్న పైప్‌లైన్ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.