BHPL: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ దిలీప్‌ను భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు శుక్రవారం పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
కానిస్టేబుల్ దిలీప్ కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర దంపతులు


