హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా

BHPL: టేకుమట్ల మండలంలోని భూర్ణపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల రైతులు విద్యుత్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వరి పంటలకు నీళ్లు పెట్టేందుకు, వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.