హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు త్వరలోనే అనుమతి: మంత్రి కోమటిరెడ్డి

NLG: మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు రూ. 7,600 కోట్లతో 52 కి. మీ మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమైందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫారెస్ట్ జోన్ అడ్డంకులను దాటేందుకు గతంలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలు పంపామన్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తుల ప్రయాణ ఆంక్షలు, వసతి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కారిడార్ అత్యవసరమన్నారు.