హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట

KMM: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కిష్టారం గ్రామం ముందుంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌ అన్నారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం హైస్కూల్‌లో ఆడిటోరియం, నూతన తరగతి గదులు, సీసీ రోడ్డు ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.