హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: FMGE ఇంటర్న్‌ల ధర్నా

MLG: స్థానిక మెడికల్ ఇంటర్న్‌లకు సమానంగా స్టైపెండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ FMGE ఇంటర్న్‌లు శుక్రవారం ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన స్టైపెండ్ ఇవ్వాలని నినాదాలు చేశారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన తమకు ఇతర మెడికల్ ఇంటర్న్‌లకు సమానంగా స్టైపెండ్ చెల్లించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలన్నారు.