హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయం

KRNL: ఆదోని మండలం చిన్న పెండేకల్‌కు చెందిన రైతు ఈడిగ శివసేన కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు నెలల క్రితమే ఆయనకు వివాహమైంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. యువత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా జీవితంపై ఆశతో ముందుకు సాగాలని సూచించారు.